చిత్తూరు జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో... జనతా రైతు బజార్ల ద్వారా కూరగాయల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రహదారులపై కూర్చొని కూరగాయలను అమ్మకుండా... స్థానిక మార్కెట్ యార్డులో భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
పీలేరు, కలికిరి, ములకలచెరువు మార్కెట్లో కూరగాయల అమ్మకాలు మొదలయ్యాయి. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మార్కెట్ కార్యదర్శి వద్ద తమ పేర్లు నమోదు చేసుకుని అమ్మకాలు కొనసాగించవచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.