ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కల్యాణోత్సవ సేవను భక్తులు వీక్షించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. టిక్కెట్లు పొందిన భక్తులకు కల్యాణోత్సవ అక్షింతలు, వస్త్రాలను తపాలా ద్వారా పంపనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తగ్గేవరకు దర్శనాల సంఖ్యను పెంచే ఆలోచన లేదని చెప్పారు. ఎస్వీబీసీని ప్రకటనలు లేని ఛానల్‌గా ప్రకటించిన ఛైర్మన్... నిర్వహణ కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని వివరించారు. ధర్మ ప్రచారం కోసం మరిన్ని లైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం హిందీ ఛానల్‌ను త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు.
ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవ టిక్కెట్లు.. త్వరలో..! - corona effect on tirumala
శ్రీవారి కల్యాణోత్సవ టిక్కెట్లను ఆన్లైన్లో త్వరలో ఆందుబాటులో ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఉన్నతాధికారులతో వైవీ సుబ్బారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కల్యాణోత్సవాన్ని చూడవచ్చని వివరించారు.
వైవీ సుబ్బారెడ్డి
Last Updated : Jul 30, 2020, 8:17 PM IST