శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచ్చేశారు.పర్యావరణ పరిరక్షణ,అన్ని జాతుల సమానమనే సందేశాన్ని మనం శ్రీకృష్ణావతారం లో చూడొచ్చని తెలిపారు.తిరుమల,తిరుపతి,తిరుచానూరు,పలమనేరులోని గోవులను సంరక్షించేందుకు విశేషకృషి చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ పూజలో జేఈవో బసంత్ కుమార్,ప్రభుత్వ విప్,తుడా ఛైర్మన్ చెవిరెడ్డి పాల్గొన్నారు.
తిరుపతి గోసంరక్షణశాలలో కృష్ణాష్టమి వేడుకలు - గోసంరక్షణశాల
తిరుపతి శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుపతి గోసంరక్షణశాలలో కృష్ణాష్టమి వేడుకలు