చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపుతో రూ. 51 లక్షల 88 వేల ఆదాయం వచ్చింది. మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు భక్తుల నుంచి వచ్చిన కానుకలు, ఆన్లైన్లో ఆర్జిత సేవలతో ఈ ఆదాయం సమకురినట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. సాధారణంగా ప్రతినెల రూ. కోట్లలో ఆదాయం సమకూరే ఈ ఆలయానికి... లాక్డౌన్ ప్రభావంతో భక్తులకు ఆలయ దర్శనం లేకపోవడం వల్ల భారీగా తగ్గిందని ఈవో తెలియజేశారు.
శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపు..రూ. 51 లక్షల ఆదాయం
శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ ప్రభావంతో భక్తులు దర్శనం తగ్గి ఆలయానికి రూ. 51 లక్షల 88 వేల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు.
ఆలయంలో ఆదాయ లెక్కిస్తున్న స్వచ్ఛంద సంస్థలు