చంద్రగిరి శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సుప్రభాత సేవలతో స్వామివారిని మేల్కొల్పి.. నిత్యకట్ల కైంకర్యపూజలు నిర్వహించారు. ప్రధానంగా కోవిడ్ నిబంధనల మేరకు స్వామివారి ఉత్సవాలను దేవాలయ అధికారులు, అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.
సాయంత్రం పట్టు పీతాంబరాలతో అలంకృతులైన స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచ్చివాహనంపై కొలువుదీర్చి పాంచరాత్ర ఆగమోక్తంగా శ్రీకోదండరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం సూపరింటెండెంట్ కుమార్ పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు.