మదనపల్లె వారపు సంతలో అక్రమ నిర్మాణాలు, విద్యుత్ మీటర్లు తొలగించాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. వారపు సంతలో ఉన్న ట్యాంక్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. చిరు వ్యాపారులకు కూడా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వచ్చి.. అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
మదనపల్లె వారపు సంత వద్ద చిరు వ్యాపారుల ఆందోళన - మదనపల్లె తాజా వార్తలు
మదనపల్లె వారపు సంత వద్ద చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. దగ్గరలో ఉన్న ట్యాంక్‌పైకి ఎక్కి తమ నిరసన తెలిపారు. పోలీసులు అక్కడకు వచ్చి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మదనపల్లె వారపు సంత వద్ద నిరసన
TAGGED:
మదనపల్లె తాజా వార్తలు