చిత్తూరు జిల్లా తిరుపతి సబ్‌జైలులో తుపాకీ మిస్ ఫైర్ జరగడంతో సెంట్రీగార్డు లక్ష్మీనారాయణ మృతి చెందాడు. రాత్రి విధులు నిర్వహించేందుకు వేరే సెంట్రీ రావడంతో.. తుపాకీని అతనికి అప్పగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి ఇటీవలే తిరుపతి సబ్ జైలుకు అటాచ్ మెంట్‌పై లక్ష్మీ నారాయణ రెడ్డి వచ్చారు. తుపాకీ మిస్ ఫైర్‌తో మరణించిన అతడి మృత దేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
తుపాకీ మిస్‌ఫైర్.. తిరుపతి సబ్ జైలు సెంట్రీగార్డు మృతి
తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో తిరుపతి సబ్‌జైలులో విధులు నిర్వహిస్తున్న సెంట్రీ గార్డు లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందాడు. విధులు మారే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
తుపాకీ మిస్‌ఫైర్.. తిరుపతి సబ్ జైలు సెంట్రీగార్డు మృతి