చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అగరాల, కొటాల గ్రామ పంచాయతీల మధ్యలో.. పంట పొలాలకు ఆనుకొని ఉన్న కొండలపై క్వారీ వ్యాపారుల కన్ను పడింది. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు తోడవటంతో గుట్టుచప్పుడు కాకుండా కొలతలు వేసి సరిహద్దుల్లో గుర్తులు వేయటం చకచకా జరిగిపోయాయి. పంట పొలాలకు ఆనుకొని ఉన్న కొండల్లో కొలతలు వేయటాన్ని గమనించిన కొటాల గ్రామ రైతులు ఆ సర్వే ఎందుకోసం.. ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించగా..అక్కడి వారి నుంచి సమాధానం రాలేదు. గుట్టుచప్పుడు కాకుండా క్వారీ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు తెలుసుకున్న రైతులు పంట పొలాలకు ఆనుకొని క్వారీ నిర్వహిస్తే పంటలు సర్వనాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వేసిన గుర్తులు:
డ్రోన్ సాయంతో సర్వే..
కొటాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 557లో సుమారు 140.93 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొటాల గ్రామానికి చెందిన 15 మంది రైతులకు సంబంధించిన పట్టాదారు భూములు కలసి ఉన్నప్పటికీ సమీపంలోని కొండ ప్రాంతంలో గత మూడు రోజులుగా డ్రోన్ యంత్రాల సాయంతో సర్వే నిర్వహించి గుర్తులు వేశారు. పట్టాదారు భూముల్లోనూ సరిహద్దు రాళ్లు నాటుతుండగా కొటాల గ్రామానికి చెందిన వరదయ్యనాయుడు, ప్రతాప్‌చౌదరి, శేఖర్ నాయుడు, దీనదయాల్ నాయుడుతో పాటు మరికొంత మంది గ్రామ రైతులు సర్వే చేస్తున్న వారిని నిలదీశారు. ఎవరు మీరు?.. అనుమతి లేకుండా పట్టా భూముల్లో గుర్తులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదని గగ్గోలు పెడుతున్నారు.
అధికార పార్టీ బంధువుకోసం..