తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ప్రారంభమైన జ్యేష్టాభిషేకం.....రెండోరోజు అంగరంగ వైభవంగా సాగింది. మూడురోజుల పాటు జరగనున్న జేష్టాభిషేకంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి ముత్యాల కవచం సమర్పించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.
శ్రీవారి ఆలయంలో రెండోరోజు ఘనంగా జ్యేష్ఠాభిషేకం - శ్రీవారి ఆలయంలోజ్యేష్ఠాభిషేకం తాజా వార్తలు
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం 4వతేదీన ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలోజ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. రెండవరోజైన ఈరోజు ముత్యాల కవచం సమర్పించారు.
శ్రీవారి ఆలయంలో రెండోరోజు ఘనంగా జ్యేష్ఠాభిషేకం
కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జ్యేష్టాభిషేకాన్ని ఏకాంతంగా చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు జూన్ 8వతేదీన నుంచి ఆలయంలోకి దర్శనాలను.. అనుమతించనున్నారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో శ్రీవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇదీచూడండి.శ్రీశైలం ఆలయ ఉద్యోగులపై వేటు