చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొత్తగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల కోసం సదరం వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. వారంలో ప్రతి సోమవారం వయస్సుతో సంబంధం లేకుండా కనీసం 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు సదరం ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో పరీక్షలు చేసుకునేందుకు మీసేవా ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని వికలాంగులను కోరారు. సోమవారం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరానికి నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిని పరీక్షించి ధ్రువపత్రాలను మంజూరు చేస్తామని అన్నారు. అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇవ్వడమే సదరం పథకం ఉద్దేశ్యమని రవికుమార్ పేర్కొన్నారు.
చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సదరం ప్రారంభం - వైకల్య నిర్దారణ ధ్రువపత్రాల తాజా న్యూస్
గతంలో "సదరం" పథకం ద్వారా వికలాంగులకు పలు విధాలుగా ఉపయోగపడే వైకల్య నిర్దారణ ధ్రువపత్రాలను డాక్టర్ల వద్ద పొందడానికి కనీసం మూడు నెలలు పట్టేది. కానీ ఇప్పుడు రోజులలోనే సదరం ధ్రువపత్రాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వికలాంగులను డాక్టర్లు పరీక్షించారు.
చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సదరం ప్రారంభం
TAGGED:
చంద్రగిరిలో సదరం పథకం న్యూస్