చిత్తూరు జిల్లా పాకాల మండలం బైయనపల్లిలో.. వైకాపా జిల్లా కార్యదర్శి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగలు.. చెన్నకేశవరెడ్డి, అతని భార్యపై దాడికి దిగి.. తీవ్రంగా గాయపరిచారు. అనంతరం 9.5 లక్షల విలువైన బంగారు, నగదును దోచుకువెళ్లారు.
వైకాపా జిల్లా కార్యదర్శిపై దాడి... బంగారం, నగదు చోరీ - వైకాపా నేత ఇంట్లో దొంగతనం న్యూస్
అర్ధరాత్రి దాటిన తరువాత ఆ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. భార్యాభర్తపై దాడికి దిగారు. బాధితులిద్దరినీ గాయపరిచి.. బంగారం, నగదును దోచుకువెళ్లారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైయనపల్లిలో జరిగింది.
చోరీ
అర్థరాత్రి సమయంలో.. ముఖానికి ముసుగు వేసుకొని కారులో దుండగలు వచ్చినట్లు బాధితుడు చెన్నకేశవరెడ్డి తెలిపారు. కర్రలు, కత్తిపీటతో తమపై దాడికి దిగారని వాపోయారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారని చెన్నకేశవరెడ్డి అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కర్ణాటకలో ఉంటూ.. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్!