రాష్ట్రంలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి యజమాని మరణించడంతో.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారెందరో..! ఇలాంటి ప్రమాదాల వల్ల తల్లితండ్రులకు గర్భశోకం మిగులుతోంది. ఆసుపత్రికి, పాఠశాలలు, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లిళ్లకు వెళ్లూ..ప్రమాదవశాత్తు విగతజీవులుగా మారుతున్నారు. ఇలా రోజూ మరణిస్తున్నా... వేగాన్ని మాత్రం ఆపట్లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టినా...అంతంతమాత్రంగానే వింటున్నారు. ప్రమాదాలలో మరణిస్తున్నారు.
పక్షవాతానికి మందు తీసుకోవడానికి వచ్చి..తిరుగు ప్రయాణంలో!
కర్నూలు జిల్లా పాణ్యం మండలం సుగాలి మిట్ట సమీపంలో జాతీయ రహదారిపై... కారు లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన సంజమ్మ భర్త కేశాలుకు పక్షవాతం మందు తీసుకోవడానికి.... కారులో నంద్యాల సమీపంలోని ఉమాపతి నగర్‌కు వచ్చారు. తిరిగి రాజోలుకి వెళ్తున్న సమయంలో..రహదారిపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజమ్మ మృతిచెందగా...భర్త కేశాలకు, డ్రైవర్ బిసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో ...కారులో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీయడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది.
శునకం అడ్డు రావడంతో