చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేట సమీపంలో ఆటో, కారు ఢీకొన్నాయి. పీలేరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆటోను.. తిరుపతి నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది.
ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళల్లో... ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలిని పీలేరు మండలానికి చెందిన సుగుణగా గుర్తించారు. చంద్రగిరి పోలీసులు క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. విచారణ చేపట్టారు.