చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) బాధ్యతలు ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ... ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కొలువుదీరిన మంత్రివర్గంలో రోజాకు స్థానం దక్కలేదు. రోజాకు మంత్రి పదవి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరిగింది. మంగళవారం సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను రోజా కలిశారు. ఈ నేపథ్యంలో రోజాను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
తనకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినందుకు రోజా ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.