Red sandal: చిత్తూరు జిల్లాలోని శేషాచల అటవీ ప్రాంతాన్ని గత కొద్ది రోజులుగా భాకరాపేట అటవీ శాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ చేస్తున్నారు. నిన్న రాత్రి యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన సెంట్రల్ బీట్లో కూంబింగ్ కు వెళ్లిన అధికారులకు దొర్రికనుమ వద్ద ఎర్రచందనం దుంగలను తెస్తూ నలభై మంది స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించిన స్మగ్లర్లు.. రాళ్లదాడి చేస్తూ పరారయ్యారు. సంఘటనా స్థలానికి అధికారులు అదనపు బలగాలను రప్పించుకోవడంతో ఎర్రచందనం దుంగలను పడవేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. పరిసరప్రాంతాలలో గాలించిన అధికారులకు 10లక్షల రూపాయల విలువైన 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్లు కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నట్లు ఎఫ్ఆర్వో పట్టాభి తెలిపారు.
Red sandal: రూ.10లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఎర్రచందనం దుంగలు
Red sandal: చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన సెంట్రల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 36 ఎర్రచందనం దుంగల్ని పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Red sandal