రాయలసీమ ప్రత్యేక రైలు నిజామాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంది. ఈ రైలులో 530మంది ప్రయాణికులు తిరుపతికి చేరుకోగా... వీరిలో 58 మంది వృద్ధులు, చిన్నారులకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మిగిలినవారికి శరీర ఉష్ణోగ్రత తనిఖీలు, హోం క్వారంటైన్ స్టాంపులు లేకుండానే అధికారులు వదిలేశారు. కొవిడ్-19 ప్రోటో కాల్ ప్రకారం ప్రయాణికులు రైలు ఎక్కే స్టేషన్లోనూ...వారి గమ్యస్థానాల్లోనూ థర్మల్ స్క్రీన్ తో శరీర ఉష్ణోగ్రత తనిఖీ నిర్వహించాల్సి ఉంది. దీన్ని అధికారులు పాటించలేదు. పరీక్షలు నిర్వహించకుండానే వారిని ఇళ్లకు తరలించడంపై నగరవాసుల్లో ఆందోళన నెలకొంది.
నిజామాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న రాయలసీమ ప్రత్యేక రైలు
నిజామాబాద్ నుంచి బయలుదేరిన రాయలసీమ ప్రత్యేక రైలు తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చేరుకున్న వారిలో కొందరికే అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించి... మిగిలిన వారిని వదిలేయటంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న రాయలసీమ ప్రత్యేక రైలు