'ప్రచారానికి సిద్ధం' - సేవాసదన్
మైదుకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సేవసదన్ ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మైదుకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమలలో సేవాసదన్ భవనంలో తితిదే పూజలు నిర్వహించింది. కొండపై సేవ చేయడానికి వచ్చే వారి వసతి కోసం 100 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు.త్వరలోనే సేవాసదన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. పూజా కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారని...నియోజక వర్గంలో ప్రచారం చేసుకోవాలని సీఎం ఆదేశించినట్లు పుట్టా తెలిపారు.