తిరుపతిలో గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గరుడ వారధి నిర్మాణానికి తితిదే నిధులు కేటాయించటంపై తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్ వేశారు. రూ.458 కోట్లు కేటాయింపుపై పిల్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వంతో పాటు తితిదేకు హైకోర్టు నోటీసులిచ్చింది. తితిదే వాటాగా 67శాతం నిధులు కేటాయించేలా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకర్షణీయ నగరంలో భాగంగా గరుడ వారధి చేపట్టారు. తితిదే 67శాతం, తిరుపతి నగరపాలక సంస్థ 33 శాతం నిధులతో గరుడ వారధి నిర్మాణానికి పూనుకున్నారు.
గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యం
తిరుపతిలో గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. నిర్మాణానికి తితిదే నిధులు కేటాయించటంపై పిటిషన్ వేశారు.
గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యం