ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధికి నోచుకోని ఏర్పేడు రైల్వేస్టేషన్​ - problems

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఉన్న ఏర్పేడు రైల్వేస్టేషన్​లో ప్రయాణికులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలతో సతమతం

By

Published : Jul 2, 2019, 3:13 PM IST

సమస్యలతో సతమతం

బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్ ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. స్టేషన్​కు సరైన రహదారి లేక అక్కడ రైల్వేస్టేషన్ ఉన్నట్లు బయటిప్రాంతాల వారికి తెలియడం లేదు. స్టేషన్ లోపలికి వెళ్లే ఉన్న ఒక్క రహదారి కూడా రాళ్లు పైకి తేలి నడవటానికి వీలు లేకుండా ఉంది. రహదారి మెుత్తం పిచ్చిమెుక్కలతో నిండిపోయింది. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం అంతంత మాత్రంగానే ఉండటంతో అక్కడనుంచి ప్రయాణించడానికి ఎవరూ సాహసించడం లేదు. స్టేషన్​కు దగ్గరలోనే మలయాళ స్వామి వ్యాస ఆశ్రమం, ఐఐటి, ఐసర్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. దూరమైనా విద్యార్ధులు తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి స్టేషన్ల నుంచి ప్రయాణిస్తున్నారు. స్టేషన్ ను అభివృద్ధిపరిచి ప్రయాణికులకు ఉపయోగకరంగా మార్చాలంటూ రైల్వే ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్యలు పరిష్కరించటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details