ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెల్లెలి కుమారుడి మరణం తట్టుకోలేక మహిళ మృతి - srikalahasthi recent death news

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని చితలపాళెంలో విషాదం నెలకొంది. చెల్లెలి కుమారుడి మరణ వార్త విని పెద్దమ్మ గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

police protecting in chittoor dst srikalahasthi due to murder
police protecting in chittoor dst srikalahasthi due to murder

By

Published : Aug 14, 2020, 1:34 PM IST

చెల్లెలి కుమారుడి మరణం తట్టుకోలేక పెద్దమ్మ గుండె పోటుతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని చితలపాళెంలో జరిగింది. చింతలపాళెంలో కొద్ది రోజులుగా రైతులు, షీకారుల మధ్య వివాదం జరుగుతోంది. ఈ వివాదంలో ఇటీవల కాలంలో షికారీకి చెందిన బబ్లీ(36)హత్యకు గురయ్యారు. ఈ మరణ వార్త విని శ్రీకాళహస్తి మండలంలోని ఎంపెడు ఈశ్వరయ్య కాలనీకి చెందిన బబ్లీ పెద్దమ్మ సరోజమ్మ(70) గుండె పోటుతో మృతి చెందారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఏఎస్పీ ముని రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details