చిత్తూరు జిల్లా నగరి మండలం ఏకాంబర కుప్పానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో పోరాడుతూ జూన్30న తిరుపతి రుయాలో మృతిచెందాడు. కుమారుని మరణంతో దిగులు పడి అతని తండ్రి కూడా మరణించడం గ్రామంలో విషాదం నెలకొంది.
కరోనాతో కుమారుడు... కలతతో తండ్రి మృతి... అంత్యక్రియలు చేసింది ఖాకీ - police made final rights for a man in chittor
ధైర్యంగా విధులు నిర్వర్తిస్తూ... కరోనాపై పోరాడటమే కాదు... హృదయ విదారకమైన పరిస్థితుల్లో పెద్దమనసు చూపిస్తూ పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో పోరాడుతూ జూన్30న మృతిచెందాడు. కుమారుని మరణంతో దిగాలులో అతని తండ్రి కూడా మరణించడంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. దాంతో పోలీసులే ఆ బాధ్యతను నెరవేర్చారు. పోలీసులై ఆ నలుగురయ్యారు... అంత్యక్రియలు పూర్తి చేశారు
కరోనా సోకిన కుమారుడి అంత్యక్రియలు కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం తిరుపతిలో పూర్తిచేశారు. ఐతే కరోనా భయంతో అతని తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో... పోలీసులే ఆ బాధ్యతను తీసుకున్నారు. అందరూ ఉన్న అనాథ శవంగా వృద్ధుడు మిగిలిపోవడంతో... పోలీసులే "ఆ నలుగురి" గా మారారు. నగర సీఐ మద్దయ్య చారి తన పోలీసు సిబ్బందితో కలిసి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. జేసీబీతో శ్మశానంలో గొయ్యి తవ్వించి... వృద్ధుడికి అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వాన్ని నిరూపించారు. పోలీసులు అందించిన సేవలకు సామాజిక మాధ్యమాల్లో... పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి:'బ్లాస్ట్ 1.ఓ'... కరోనా పోరులో తిరుపతి ఐఐటీ వినూత్న ఆవిష్కరణ..