Narayana Bail Issue: మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిలు చట్ట విరుద్ధమని సుధాకర్‌రెడ్డి అన్నారు. నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వుల రద్దుకు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.
నారాయణ బెయిల్ రద్దు చేయండి.. పోలీసుల రివిజన్ పిటిషన్ - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
Narayana Bail Issue: మాజీ మంత్రి నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పిటిషన్ వేశారు.
నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రివిజన్ పిటిషన్ దాఖలు
చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. ఈ కేసులో 435, 437, సెక్షన్ 18 పీఆర్సీ కింద సొంత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిలు ఇవ్వడం న్యాయబద్దంగా లేదన్నారు. కనీసం రిమాండ్ సైతం చేయలేదని చెప్పారు. కుట్ర పన్నడానికి ఛైర్మన్ పదవి అవసరం లేదన్నారు. ఈ కేసులో ముద్దాయిలు ఇచ్చిన పత్రంలో నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందని అన్నారు. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
Last Updated : May 13, 2022, 5:42 PM IST