చిత్తూరులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు... సిబ్బందికి డ్రైవింగ్ లైసెన్సుల మేళా ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో తలమునకలై ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం లేదని ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు. వాహన చోదకులకు ఆదర్శంగా ఉండాల్సిన పొలీసులకు కచ్చితంగా లైసెన్సులు ఉండాలని అభిప్రాయ పడ్డారు.
''అందరూ రహదారి నియమాలు పాటించాలి'' - police
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని.. ప్రమాదాల నివారణకు సహకరించాలని చిత్తూరు ఎస్పీ సూచించారు.
పోలీసులు