రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు , సరస్సులు , నదులు , కాలువల సమీపంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ... ఏర్పాటు చేసిన పెట్రోలు పంపులు , అవుట్ లెట్లపై సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఆధారంగా వాటన్నింటిని తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేస్తామని తేల్చిచెప్పింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
'నీటి వనరుల వద్ద పెట్రోల్ పంపులుంటే తొలగింపు' - chittoor district updates
రాష్ట్రంలో చెరువులు, కాలువలు, నదుల సమీపంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ... ఏర్పాటు చేసిన పెట్రోలు పంపులు , అవుట్ లెట్లపై సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని పీబీసీని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఆధారంగా వాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
High court
జాతీయ హరిత ట్రైబ్యునల్ , కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తుంగలో తొక్కుతూ చిత్తూరు జిల్లా యర్రవారిపాలెం మండలం , యల్లమంద గ్రామ పరిధిలో పాఠశాల , చెరువుకు సమీపంలో పెట్రోల్ అవుట్లేట్ ఏర్పాటు చేయబోతున్నారని, ఆ ప్రక్రియను నిలువరించాలని కోరుతూ కోనేటివారిపల్లె గ్రామానికి చెందిన బి.భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.
ఇదీ చదవండి:అక్కడ వైకాపా కార్యాలయం కట్టినట్లు తేలితే.. కూల్చివేత ఉత్తర్వులు: హైకోర్టు