ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉదయం నడకకు రుసుము వసూలును ఉపసంహరించండి'

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వాకర్స్ అసోషియేషన్, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఉద్యానవనాల్లో ఉదయం నడకకు వచ్చేవారి నుంచి ప్రవేశ రుసుము వసూలు చేయాలన్న నిర్ణయంపై వారు నిరసన చేపట్టారు.

people organisations protest
వాకర్స్ అసోషియేషన్, ప్రజాసంఘాల ఆందోళన

By

Published : Nov 5, 2020, 3:03 PM IST

తిరుపతిలోని ఉద్యానవనాల్లో ఉదయం నడకకు వచ్చే వారు వంద రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇందుకు వ్యతిరేకంగా వాకర్స్ అసోషియేషన్, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రవేశ రుసుము వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు బడ్జెట్​లో నిధులు పెంచాల్సిందిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరైంది కాదన్నారు. ఆరోగ్యంగా ఉండేదుకు వ్యాయామం చేసేవారిని ప్రోత్సహించాలి కానీ రుసుము వసూలు చేయటం సమంజసం కాదని చెప్పారు.

కరోనా నిబంధనల దృష్ట్యా చాలా పార్కులు కొన్నాళ్లుగా మూతపడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రుసుము చెల్లించాలనటం ప్రజలను నిరాశకు గురిచేయటమే అవుతుందన్నారు. యూజర్​ ఛార్జీల వసూలుకు కేంద్రం అనుమతించిన కారణంగానే... రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇష్టానుసారం వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ఈ విషయంపై ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో రోడ్డుపై నడిచినా, గాలి పీల్చినా పన్ను విధిస్తారని అన్నారు. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదని..హక్కుగా అందరూ ఆందోళనలో పాల్గొనాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details