'మోదీని అడుగు నా దేశభక్తేంటో'
చిత్తూరు బహిరంగ సభలో భాజపా నేత జీవీఎల్‌ను పవన్ విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తన దేశ భక్తి తెలియాలంటే మోదీని అడుగు చెప్తారు అన్నారు.
ఎక్కడ తగ్గాలో పవన్ నేర్చుకోవాలి అన్న జీవీఎల్ మాటలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ పెరగాలో కూడా తెలిసే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేవలం భాజపాకు మాత్రమే దేశ భక్తి సొంతం కాదన్న పవన్...తన దేశభక్తి తెలుసుకోవాలి అంటే మీ మోదీని అడుగంటూ ఎంపీకి చురకలు అంటించారు. ప్రధానిపై గౌరవం ఉందని తనను బానిస అనుకుంటే భాజపా నాయకులను ఉపేక్షింబోమని హెచ్చరించారు.
తటస్థులతో నేడు సమావేశం
చిత్తూరు పర్యటనలో ఉన్న పవన్ నేడు జనసేన పార్టీ కార్యకర్తలు, తటస్థులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం జీడీ నెల్లూరు, రేణిగుంట, ఏర్పేడులో రోడ్ షో నిర్వహించనున్నారు.