ఇటీవల ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల కితబాకంటి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్పై పరామర్శించడానికి వెళ్లిన నిజనిర్ధరణ నాయకులను.. గిరిజనులు అడ్డుకున్నారు. సిమిలిగూడ సమీపంలోని జానిగూడ వద్ద నాయకుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఇన్ఫార్మల నెపంతో మావోయిస్టులు గిరిజనుల ప్రాణాలు తీసినప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నవారు తమకు వద్దని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో దాదాపు 100 మందికిపైగా పాల్గొన్నారు. దీనిపై ఆంధ్ర, తెలంగాణ పౌరసంఘ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. అనంతరం వెనుతిరిగి వెళ్లిపోయారు.
నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు - girijanulu
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్పై పరామర్శించడానికి వెళ్లిన నిజనిర్ధరణ నాయకులను.. గిరిజనులు అడ్డుకున్నారు. ఇన్ఫార్మల నెపంతో మావోయిస్టులు గిరిజనుల ప్రాణాలు తీసినప్పుడు రానివారు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
నిజనిర్ధరణ కమిటీ నాయకులను అడ్డుకున్న గిరిజనులు