ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యాధికారి నిర్వాకంతో రోగుల అవస్థలు

చిత్తూరు జిల్లాలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి నిర్వాకం వల్ల రోగులకు వైద్యసేవలు అందనంత దూరంలో ఉన్నాయంటూ వాపోతున్నారు. అత్యవసర కాలంలో చికిత్స అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యాధికారి నిర్వాకంతో రోగుల అవస్థలు

By

Published : Aug 10, 2019, 10:17 AM IST

వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోతే ఆసుపత్రి సిబ్బందే చికిత్స అందిస్తుంటారు. కానీ ఓ ఆసుపత్రిలోని వైద్యాధికారి తాను ఉంటేనే వైద్యం అందించాలంటూ ఆసుపత్రిలోని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఇటీవల జారీ చేసిన హుకుం వల్ల సిబ్బంది అత్యవసర పరిస్థితులైన సరే వైద్యం అందించడానికి వెనుకంజ వేస్తున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించని వైద్యాధికారి నిర్వాకంతో రోగులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తూ అవస్థలు పడుతున్నామన్నారు.

వైద్యాధికారి నిర్వాకంతో రోగుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details