కోర్టు ఆదేశాలతోనే పరిషత్ ఎన్నికలను నిర్వహించామని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి తుడా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చి తీర్పుపై స్పందించారు. గతంలో కోర్టు ఎన్నికలు పెట్టుకోమంటేనే జరిపామన్న ఆయన.. కోర్టు వద్దంటే ఆపేసే వాళ్లమని వ్యాఖ్యానించారు.
కోర్టు ఆదేశాలతోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాం: చెవిరెడ్డి
పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడంపై ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పందించారు. కోర్టు ఆదేశాలతోనే పరిషత్ ఎన్నికలను నిర్వహించామని స్పష్టం చేశారు. ఇలాంటి ఆటంకాలు ప్రభుత్వానికి ఎదురు కావటం సాధారణమైపోయిందన్నారు. ప్రజల తీరుకు అనుగుణంగా తమ ఆలోచనలను అమలుచేస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ప్రభుత్వానికి అవసరమై ఎన్నికలకు వెళ్లలేదని.. ఇలాంటి ఆటంకాలు ప్రభుత్వానికి ఎదురు కావటం సాధారణమైపోయిందన్నారు. ప్రజల తీరుకు అనుగుణంగా తమ ఆలోచనలను అమలుచేస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... రఘురామ బెయిల్ పిటిషన్: ముకుల్ రోహత్గీ వర్సెస్ దుష్యంత్ దవే