తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరగనున్నందున పొరుగు సేవల కార్మికులు నిరసన గళం వినిపించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనాభవనం ఎదుట ఆందోళనకు దిగిన ఉద్యోగులు... తమను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించే విధంగా నిర్ణయం తీసుకోవటాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తమను తితిదే ఉద్యోగులుగానే పరిగణిస్తూ.... టైం స్కేల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలంటూ బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరసన - thirupathi news today
తిరుపతిలో అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరసన చేశారు. తమను కార్పోరేషన్ ఉద్యోగులుగా గుర్తిస్తూ తితిదే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరసన