ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలోని దేవాలయాల్లో దర్శనాలు ప్రారంభం - opened Visits to the famous temples of Chandragir

నేటి నుంచి చంద్రగిరి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయాలతో పాటు ప్రముఖ దేవాలయమైన ముక్కోటి, శ్రీ మూలస్థానమ్మ గుడి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు.

chittor district
చంద్రగిరిలోని ప్రముఖ దేవాలయాలలో ప్రారంభమైన దర్శనాలు

By

Published : Jun 8, 2020, 1:13 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలతోపాటు ప్రముఖ దేవాలయమైన ముక్కోటి, శ్రీ మూలస్థానమ్మ గుడి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. తితిదే అనుబంధ ఆలయాలలో ఎస్ఎంఎస్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన వారికి పూజలకు అనుమతిస్తున్నారు.

శ్రీనివాసమంగాపురంలో ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి వారి కైంకర్యాలు విరామం ఉంటుందని పేర్కొన్నారు.

మిగతా ప్రముఖ దేవాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దర్శనానికి ముందు భక్తులకు టెంపరేచర్ చెక్ చేసి.. శానిటైజర్ ,మాస్కులు, గ్లౌజ్​లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని సూచించారు.

ఇది చదవండిశ్రీవారి దర్శనం.. మాస్క్​లు, భౌతిక దూరం తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details