ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 వేల మందికి నిత్యావసరాలు అందజేశాం: నారా భువనేశ్వరి

లాక్​డౌన్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు ఎన్టీఆర్​ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారాభువనేశ్వరి తెలిపారు. రెండున్నర లక్షల మందికి ఎస్‌ఎస్‌-99 మాస్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బ్లడ్‌ బ్యాంకుల ద్వారా రోగులకు 5 వేల యూనిట్ల రక్తం పంపిణీ చేశామన్నారు.

nara bhuvaneswari
nara bhuvaneswari

By

Published : May 8, 2020, 5:55 PM IST

సంక్షోభ సమయంలో సేవ చేయడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ఆ‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారాభువనేశ్వరి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పేదలకు తమ వంతు సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ 20వేల మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశామని భువనేశ్వరి తెలిపారు. బియ్యం, కూరగాయలు, వంటనూనె, ఇతర నిత్యావసరాలతో పాటు పండ్లు, కోడిగుడ్లు.... ఏపీ, తెలంగాణల్లో అందించామన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర లక్షల మందికి ఎస్‌ఎస్‌-99 మాస్కులు పంపిణీ చేసినట్లు భువనేశ్వరి వెల్లడించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు‌ ట్రస్ట్‌ తరఫున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లోని రోగులు, తలసేమియా బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బ్లడ్ ‌బ్యాంక్‌ నిత్యం రక్తం అందిస్తోందని భువనేశ్వరి తెలిపారు. హైదరాబాద్‌, విశాఖ, తిరుపతిల్లో ఉన్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బ్లడ్‌ బ్యాంకుల ద్వారా 5 వేల యూనిట్ల రక్తం పంపిణీ చేశామన్నారు. 3 వేల మంది రోజువారీ కూలీలు, వలస కార్మికులకు పులిహోర, బిస్కెట్‌ ప్యాకెట్లు అందించినట్లు భువనేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details