ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 23, 2020, 10:25 AM IST

ETV Bharat / state

ఉపాధి హామీ పనులతో కూలీలకు, రైతులకు ఊరట

చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. రోజూ ఉదయం 11 గంటల వరకే పనులు చేస్తూ భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిరుపేద రైతు కూలీలను అదుకోవాలనే ఉద్దేశంతో 8000 మందికి పని కల్పించారు.

chittor district
ఉపాధి హామి పనులతో కూలీలకు, రైతులకు ఊరట

చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోని నిరుపేద కూలీలు, రైతులకు ఊరటగా.. అధికారులు ఉపాధి హామీ పనులను కల్పిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక గృహాలకే పరిమితమైన నిరుపేద రైతు కూలీలను ఆదుకోవాలనే లక్ష్యంతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో 8 వేల మందికి పని కల్పించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ పనులు చేయిస్తున్నారు.

ఉదయం 11 గంటల వరకే పనులు చేసే విధంగా, రోజు కూలీ 243 రూపాయలు చెల్లించే ఏర్పాట్లు ,వేసవి భత్యం 30% ఇస్తూ రైతు కూలీలను అధికారులు ఆదుకుంటున్నారు. కురబలకోట మండలం ముదివేడు గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులను ఏపీడీ చందన, ఇతర అధికారులు పరిశీలించారు. తరుణ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు కూలీలకు పని కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ఉపాధి పనులు కల్పిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details