ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాత...గొంతు కోస్తున్నారు..!

ఎంత డబ్బు సంపాదించిన రైతు పండించే పంటనే తినాలి. ఇదే మర్చిపోతున్న కొందరు అధికారులు... అన్నదాత గొంతు కోస్తున్నారు. విత్తనాలకు నకిలీ మకిలి అంటించి... కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. పనికి రాని విత్తనాలు సరఫరా చేసి రైతు ప్రాణం తీస్తున్నారు. కోట్లు దండుకుంటున్నారు.

పంట ఏదైనా...వాళ్లు నకిలీ చేసేస్తారు..!

By

Published : May 8, 2019, 9:03 AM IST

Updated : May 8, 2019, 10:27 AM IST

మధ్యవర్తుల దందా..

అధికారిక గుర్తింపు పొందిన విత్తనాలతో నకిలీ విత్తనాలు కలిపి అమ్మిన తంతంగాలే ఇప్పటి వరకు తెలుసు. చిత్తూరులో మాత్రం అంతకు మించి అన్న రీతిలో దందా సాగింది. విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు ఆశ్చర్యానికి గురి చేశాయి.

మేలైన విత్తనాల కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర చమురు సమాఖ్య, జాతీయ విత్తన సమాఖ్య, వాసన్ స్వచ్ఛంద సంస్థతో విత్తన సాగు ప్రారంభించింది ప్రభుత్వ. సీడ్ ఆర్గనైజర్స్‌ను నియమించి రైతులకు ఫౌండేషన్ విత్తనాలు అందిస్తారు. ఫారం-1 పేరిట ఒప్పందం చేసుకున్న రైతులకు వాటినిచ్చి సాగు చేయిస్తారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు 3 సార్లు ఆ పంట పరిశీలించి సూచనలు చేస్తారు. ఇలా నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత సీడ్ ఆర్గనైజర్స్‌ది.

పంట ఏదైనా...వాళ్లు నకిలీ చేసేస్తారు..!

నకిలీ పత్రాలు

కాసులకు అలవాటు పడిన దళారులు రైతన్నలను నట్టేట ముంచే ఎత్తుగడలకు ప్రణాళికలు రచించారు. విశ్వవిద్యాలయాల నుంచి ఫౌండేషన్ బ్రీడ్ తీసుకొచ్చే దగ్గర నుంచి రైతుల ఎంపిక, ఒప్పందం, అధికారుల తనిఖీ అన్నీ కూర్చునే చేసేస్తున్నారు. చౌకబారు విత్తనాలు, ధాన్యాలనే కొనుగోలు చేసి... సర్టిఫైడ్ విత్తనాలుగా మార్చేస్తున్నారు.

ఒక్కరూ సాగు చేయలేదు

ఇలా సిద్ధం చేసిన 54వేల 745 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సీమ జిల్లాల్లో 2018 ఖరీఫ్‌లో పంపిణీ చేశారు. సోకి దిగుబడులు రాకపోయేసరికి అధ్యయనం ప్రారంభించింది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 14 మండలాల్లో సాగు చేసినట్లు కాగితాలపై ఉన్న 432 మంది రైతులను నేరుగా ప్రశ్నించారు. వారిలో ఒక్కరూ వేరుశనగ విత్తనాలు సాగు చేయలేదని తేలింది.

13 కోట్లు స్వాహా

కిలో వేరుశనగ విత్తనాలు 61 రూపాయిల ధర నిర్ణయించినా....అందులో నలభై శాతం అనగా...24రూపాయల 40 పైసలను ప్రభుత్వం ఖర్చుచేస్తూ...రైతులకు కిలో 36 రూపాయల 60 పైసలకే అందిస్తోంది. మిగిలిన రాయితీని ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీలకు తద్వారా సీడ్ ఆర్గనైజర్లకు అందిస్తోంది. దీన్నే ఆసరాగా తీసుకొని నాసిరకం విత్తనాలతో రైతులను నష్టపరచి..రాయితీ రూపంలో ప్రభుత్వం అందించిన డబ్బులు సైతం స్వాహా చేశారు. 2017-18 రబీ సీజన్​లో 13కోట్ల 36లక్షల రూపాయలను దళారులు దండుకున్నారు.

Last Updated : May 8, 2019, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details