కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే.. మే లో రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా వేడుక చేసుకుంటున్నామని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్.కె. రోజా తెలిపారు. చెన్నైలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్య.. మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మదర్ ఆఫ్ గాడ్స్గా పిలిచే రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో.. మాతృ దినోత్సవాన్ని తొలిసారిగా గ్రీసు దేశంలో జరుపుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.