చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలాజీ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణకు గౌతమితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా గౌతమికి, వెంకటరమణతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె... తన ఇద్దరు కుమారులతో సహా చల్లగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను గమనించిన స్థానిక రైతులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య - news updates in chitthore district
కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో జరిగింది.
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య