ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2021, 6:16 PM IST

ETV Bharat / state

మనుషులు మరిచినా...మేం మరువం!

కరోనా కట్టడికి విధించిన నిబంధనలను మనుషులు గాలికొదిలేస్తున్నా.. ఏ మాత్రం కుదురుగా ఉండని వానరాలు భౌతిక దూరాన్ని పాటిస్తున్నాయి. ఆహారం కనిపిస్తేనే పోటీపడే కోతులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆహారాన్ని తీసుకోవటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వింత ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

monkeys
కోతులు భౌతిక దూరం

మనుషులు మరిచినా...మేం మరువం!

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోన ప్రాంతం కర్ఫ్యూ కారణంగా మూతపడింది. పర్యాటకులు లేకపోవటంతో..మూగజీవాలు ఆకలితో అల్లాడిపోతున్నాయి. దీంతో వాటి ఆకలి తీర్చేందుకు ముందుకువచ్చిన కైలాసనాథ ఆలయ కమిటీ.. కోతులకు ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేసింది. అయితే వానర మూకలకు గుంపుగా దూసుకువచ్చే లక్షణం ఉండటంతో..ఆలయ కమిటీ అచ్చం మనుషులకు గీసినట్లే సర్కిళ్లు గీసి ఆహారాన్ని అందిస్తోంది.

ఆశ్చర్యకరంగా కోతులు సైతం సరిగ్గా అదే గిరిలో కూర్చుని చాలా క్రమశిక్షణతో ఆహారాన్ని తీసుకుంటున్నాయి. వానరాలే అంత క్రమశిక్షణను పాటిస్తున్న వేళ..విచక్షణ జ్ఞానం కలిగిన మనుషులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని భౌతిక దూరం పాటించటం, మాస్క్​ను తప్పనిసరిగా వాడటం వంటి కరోనా నిబంధనలను పాటించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి

నిరాడంబరంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details