"కోటి వృక్షార్చనలో పాల్గొందాం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరిత కానుక ఇద్దాం" అని ప్రముఖ సినీ నటి, రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈనెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. తెరాస రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చనలో పాల్గొని గంటలో కోటి మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు హరిత కానుకగా.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. పచ్చదనం - పరిశుభ్రతతో కాలుష్య రహిత తెలుగు రాష్ట్రాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకలపై ఎమ్మెల్యే రోజా స్పందన - cm kcr birth day updates
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున నిర్వహించతలపెట్టిన కోటి వృక్షార్చనలో పాల్గొందామని.. సినీ నటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. సీఎం కేసీఆర్‌కు హరిత కానుక ఇద్దామన్నారు.
mla-roja-response-on-kcr-birthday-celebrations