చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని హీరా కొవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. బాధితులతో ముచ్చటించారు. ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు యోగా, పుస్తక పఠనం చేయించారు.
బాధితుల్లో ఉత్సాహం కల్పించేందుకు… వారితో కలిసి క్యారమ్ బోర్డు ఆడారు. చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హీరా కొవిడ్ కేర్ సెంటర్లో 250 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే… తన సొంత నిధులతో పడకలు, ఫర్నిచర్, పౌష్టికాహారం అందించారు.