కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసేలా శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన...కేసులు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తితిదే ఆయుర్వేద ఆస్పత్రితో పాటు కళాశాలల అతిథి గృహాలు, ప్రైవేట్ సత్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కమిటీల ద్వారా వైద్యం, భోజన సదుపాయాలు, రోగుల ఆరోగ్య వివరాల సేకరణ కోసం వివిధ విభాగాలుగా ఏర్పాటు చేస్తామని వివరించారు.
అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ - కరోనా కేసులు
కొవిడ్ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలందించేలా అన్ని శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
chevireddy bhaskar reddy