తిరుపతి సమీపంలోని రేణిగుంటకు చెందిన ఇద్దరు మైనర్లు గంజాయి సేవించి.... నిన్న రాత్రి రజకుల కాలనీ వద్ద బీభత్సం సృష్టించారు. గంజాయి సేవించి... ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ వీరంగం చేశారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్రగాయాలవగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మైనర్లను తనిఖీ చేసిన పోలీసులు... వారి దగ్గర గంజాయి పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై వారిని విచారిస్తున్నారు
గంజాయి సేవించి మైనర్ల వీరంగం - ganjai
తిరుపతి సమీపంలోని రేణిగుంటకు చెందిన ఇద్దరు మైనర్లు గంజాయి సేవించి వీరంగం సృష్టించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ మహిళలను ఢీ కొట్టారు.
గంజాయి సేవించి మైనర్ల వీరంగం