ROJA MEETS CM JAGAN : నగరి వర్గపోరు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. నగరిలో జరిగిన రాజకీయ పరిణామాలు, చక్రపాణిరెడ్డి అసమ్మతి వర్గం తీరుపై సీఎంకు పర్యాటక శాఖ మంత్రి రోజా ఫిర్యాదు చేసింది. తమ వర్గాన్ని పక్కనపెట్టి చక్రపాణిరెడ్డి వర్గం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 16న ఆర్బీకేలు, వెల్నెస్ కేంద్రాలను చక్రపాణిరెడ్డి వర్గ నాయకులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి వర్గం వ్యవహారంపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
సీఎం క్యాంపు కార్యాలయానికి చేరిన నగరి వర్గపోరు.. రోజా ఏం చెప్పారంటే..! - నగరి వర్గపోరు
ROJA MEETS JAGAN : నగరిలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలు, చక్రపాణిరెడ్డి అసమ్మతి వర్గం తీరుపై ముఖ్యమంత్రి జగన్కు రోజా ఫిర్యాదు చేసింది. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
ROJA MEETS CM JAGAN