పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో... రెండు వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అక్కడే నూతనంగా నిర్మించిన జగనన్న నిలయం, నవరత్నాల ఆలయాన్ని మంత్రి ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఒకే విడతలో సుమారు 32 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి వైకాపా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రానున్న రోజుల్లో జగనన్న కాలనీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు.
minister peddireddy : 'పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం'
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జగనన్న నిలయాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం రెండువేల మంది లబ్ధిదారులకు ఇంటిపట్టాలు పంపిణీ చేశారు.
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి