ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఫలితాలను విశ్లేషించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనకు ప్రజలు ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. ఈ ఫలితాలు తెదేపాతో పాటు జనసేన ఇతర పార్టీలకు చెంపపెట్టులాంటివని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావం ఉన్నా రెండేళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు లోకేశ్‌కు డబ్బు సంపాదించడం తప్ప రాజకీయాలలో ఓనమాలు నేర్పించలేకపోయారనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బాయ్ కాట్ చేయడమంటే పరాజయాన్ని అంగీకరించటమేనని ఆయన తెలిపారు.
'పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైకాపా పక్షాన నిలబడ్డారు. 51 శాతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది. వ్యూహం ప్రకారమే ముఖ్యమంత్రి జగన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. సీఎం పరిపాలన ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. ఈ ఫలితాలు తెదేపాతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టులాంటివి ' - మంత్రి పెద్దిరెడ్డి
ఫలితాలే నిదర్శనం: మంత్రి కన్నబాబు