ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి పోరులో అంతిమ విజయం మాదే: మంత్రి కన్నబాబు - chittoor district news

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే తమను తిరుపతి పోరులో గెలిపిస్తాయని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు పాచికలు పారవని అభిప్రాయపడ్డారు.

kanna babu
తిరుపతి పోరులో అంతిమ విజయం మాదే: మంత్రి కన్నబాబు

By

Published : Apr 13, 2021, 7:23 PM IST

గడచిన 22 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తాయని మంత్రి కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించిన ఆయన పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు వైకాపాకు ఎన్నికల్లో అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:'టీకా కొరత లేదు.. ప్రణాళిక లేకపోవడమే సమస్య'

తెదేపాకు కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని కన్నబాబు అన్నారు. తిరుపతి ఎన్నికల్లో కూడా అధిక మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రచారంలో చంద్రబాబు నాయుడు చౌకబారు డ్రామాతో రక్తి కట్టించారని ఎద్దేవా చేశారు. వైకాపా దాడులు, దౌర్జన్యాలు పేరుతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శ్రీకాళహస్తిలో బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఓటమి ఖాయమని అర్థమైంది..అందుకే రాళ్లదాడి డ్రామా: అంబటి

ABOUT THE AUTHOR

...view details