ఒడిశా రాష్ట్రానికి చెందిన 1413 మంది వలస కూలీలను చిత్తూరు నుంచి ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా ఒడిశాకు పంపించారు. ఒడిశా నుంచి వివిధ పనులపై చిత్తూరు జిల్లాకు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండి పోయిన వారిని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గుర్తించారు.
వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు రైల్వే స్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. అంతా ఆరోగ్యంగా ఉన్నారని మరోసారి ధృవీకరించుకున్నాకే.. రైలెక్కించారు. ప్రయాణంలో కూలీలకు అవసరమైన భోజనం, నీటి బాటిళ్లను అందజేశారు.