తిరుమల తిరుపతి దేవస్థానం, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి మెుదలైన శోభాయాత్రలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భజన మండళ్లు పాల్గొన్నాయి. గోవిందరాజ స్వామి సత్రాల వరకూ సాగిన ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల కీర్తనలతో తిరుపతి వీధులు పులకించాయి. దారిపొడుగునా మహిళలు చేసిన కోలాటం కనులవిందుగా సాగింది.
తిరుపతిలో ఘనంగా శ్రీవారి మెట్లోత్సవం - latest metlotsava news in tirupathi
శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వేడుకలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు చేసిన వేంకటేశుడి నామస్మరణతో తిరుపతి వీధులు పులకించాయి.
ఘనంగా శ్రీవారి మెట్లోత్సవం