ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2021, 7:34 PM IST

ETV Bharat / state

నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీవారి దర్శన టికెట్లు... వ్యక్తి అరెస్టు

తిరుమల శ్రీవారిని వీలైనప్పుడల్లా దర్శించుకోవడం అతని అలవాటు. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండటంతో స్వామివారి దర్శన భాగ్యం దొరకడం అతనికి కొంత కష్టమైంది. ఎలాగైనా దర్శనం చేసుకోవాలనుకున్న అతను... అడ్డదారులు తొక్కి కటకటాలపాలయ్యాడు.

fake id
నకిలీ ఐడీతో దర్శనానికి యత్నం .. సిబ్బంది అనుమానంతో బయటపడిన వైనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్‌ కార్యాలయంలో ఓ మీడియా సంస్థ నకిలీ గుర్తింపు కార్డుతో వీఐపీ బ్రేక్‌ దర్శనం పొందేందుకు యత్నించిన వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. దర్శనం కోసం లేఖ సమర్పించగా.. గుర్తింపు కార్డును చూసిన తితిదే సిబ్బంది అనుమానంతో పై అధికారులకు సమాచారమిచ్చారు. వారి విచారణలో అది నకిలీ గుర్తింపు కార్డుగా తేలటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసుల... అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌కు చెందిన వెంకట్రామణరావుగా గుర్తించారు. తనకు తరచూ స్వామివారిని దర్శించుకోవడం అలవాటని... దర్శన టిక్కెట్లు పొందడం కోసమే నకిలీ కార్డును తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details