ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను చేపట్టారు.

chiranjeevi birthday celebrations
చిరంజీవి జన్మదిన వేడుకలు

By

Published : Aug 23, 2021, 12:09 AM IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద భారీ కేక్ కట్ చేసి చిరంజీవి కి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

విజయనగరం జిల్లా
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లాలోని .ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి, కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి

ADAVISESH: దిశ యాప్‌తో మహిళలకు ఎంతో రక్షణ..: నటుడు అడవి శేషు

ABOUT THE AUTHOR

...view details