ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SVIMS: 'తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి.. రాయలసీమకే తలమానికం' - తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మెడికల్ పరికరాల పంపణీ

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి రాయలసీమకే తలమానికంగా మారిందిని.. కష్టకాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిందని చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే అన్నారు. రూ. 5 లక్షల విలువైన 13 స్ట్రెచర్లు, 43 వేల గ్లౌజులను జయచంద్రారెడ్డి అనే దాత స్విమ్స్ ఆసుపత్రికి అందజేశారు. వాటి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

medical equipments distributed at Tirupati svims
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మెడికల్ పరికరాల పంపణీ

By

Published : Jun 30, 2021, 12:23 PM IST

కరోనా, సాధారణ కాలాల్లో వేలాదిమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలుపుతున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి రాయలసీమకే తలమానికం అని తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర రెడ్డి అన్నారు. స్విమ్స్​కు వైద్యపరికరాల వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆసుపత్రిలో అత్యంత ప్రతిభావంతులైన డాక్టర్లు, పరిపాలన వ్యవస్థతో మెరుగైన వైద్యసేవలు అందించడం శుభ పరిణామమని చెప్పారు. రూ. 5 లక్షల విలువైన 13 స్ట్రెచర్లు, 43 వేల గ్లౌజులను జయచంద్రారెడ్డి అనే దాత స్విమ్స్ ఆసుపత్రికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details